
ఏపీ తల్లికి వందనం 2026: రూ.13,000 జమకు రంగం సిద్ధం – విద్యార్థులు, తల్లులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు! :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద, త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
నగదు జమ ఎప్పుడు?
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 64.76 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా, జూలై 22వ తేదీన అర్హులైన తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ. 13,000 నగదు జమ చేయనున్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయాలు:
- బ్యాంకు ఖాతా తప్పనిసరి: ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన ఎస్సీ (SC) విద్యార్థులు మరియు ఇతర కొత్త విద్యార్థులు తమకు సొంత బ్యాంక్ అకౌంట్ లేకపోతే, వెంటనే సమీపంలోని బ్యాంకులు లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకులో (IPPB) ఖాతా తెరవాలి.
- NPCI లింకింగ్: ఖాతా తెరిచిన వెంటనే, అది తప్పనిసరిగా ఆధార్‌తో (NPCI) అనుసంధానం అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బులు జమ కావు.
- అవసరమైన పత్రాలు: ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్, పదో తరగతి మార్క్ షీట్ లేదా పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రం అవసరం.
సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన:
ప్రభుత్వం పారదర్శకత కోసం జూలై 22 నుండి సచివాలయాల స్థాయిలో అర్హత మరియు అనర్హత జాబితాలను ప్రదర్శిస్తుంది.
- అభ్యంతరాల నమోదు: జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు ఎవరైనా అర్హులు జాబితాలో లేకపోయినా లేదా ఏవైనా తప్పులు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు.
- పరిశీలన: ఆగస్టు 4 నుంచి 10 వరకు ఈ ఫిర్యాదులను పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
- చివరి గడువు: 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్త ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు ఉంది.
- తుది పంపిణీ: అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక, ఆగస్టు 30న అర్హులైన మిగిలిన వారికి ఆర్థిక సహాయం అందుతుంది.
పథకం అర్హతలు:
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ. 10,000 మించకూడదు.
- అంగన్వాడీ టీచర్లు మరియు సహాయకులకు వారి ఆదాయ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తిస్తుంది.
