RRB Assistant Loco Pilot Jobs : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నందు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి| Job notifications have been released by the Railway Recruitment Board

Spread the love
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నందు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి| Job notifications have been released by the Railway Recruitment Board :

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 పోస్టులను భర్తీ చేయనున్నారు. ₹19900 ప్రారంభ వేతనం(దీనితోపాటు అలవెన్సులు కూడా లభిస్తాయి). ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10th తో పాటు ITI, Diploma /B.Tech అర్హత కలిగి ఉండాలి.

Job notifications have been released by the Railway Recruitment Board :

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ పోస్టులకు అభ్యర్థులను CBT-1,CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ముఖ్యంగా చూపు పరీక్ష వీటి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 15 మే 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. 14 జూన్ 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికార వెబ్సైటు https://WWW.rrbapply.gov.inద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

 

దరఖాస్తు చేయు విధానం :
1.https://WWW.rrbapply.gov.in ఏ అఫీషియల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
2. మీరు మొదటిసారి అప్లై చేస్తుంటే అప్లై బటన్ పై క్లిక్ చేసి కొత్తగా అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి.
3. అకౌంట్ క్రియేట్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
4. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయండి.
5. మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి.
6. పరీక్ష భాష మరియు ట్రేడ్ ఎంపిక చేసుకోండి.
7. నెట్ బ్యాంకింగ్,డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించాలి.
8. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కాపీని పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top