SSC Jobs Notification : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నందు కొత్తగా 700+ పోస్టుల కొరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|Job Notifications For Over 700+ New Posts At The Staff Selection Commission (SSC) Have Been Released

Spread the love
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నందు కొత్తగా 700+ పోస్టుల కొరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|Job Notifications For Over 700 New Posts At The Staff Selection Commission (SSC) Have Been Released:

కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నందు భారీగా 731 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్(గ్రేడ్ సి & గ్రేట్ డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్ లేదా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా దీనికి అర్హులే.

గమనిక : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టునకు నిమిషానికి 100 పదాల వేగంతో టైప్ చేయగలగాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టునకు నిమిషానికి 80 పదాలు వేగంతో టైప్ చేయగలగాలి.

Job Notifications For Over 700 New Posts At The Staff Selection Commission (SSC) Have Been Released :

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్(Online)ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.ST/SC/OBC/PWBD వయస్సు సడలింపు ఉంటుంది. కేంద్ర సచివాలయం, రైల్వే మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సి.బి.ఐ, ఇన్కమ్ టాక్స్ మరియు కస్టమ్స్ శాఖలు నందు ఉద్యోగాలు చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణవకాశం. 24 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికార https://ssc.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 16 మే 2026 దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ.

Whatsapp Group

దరఖాస్తు విధానం :
1.https://ssc.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి Login or Register పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్,ఇమెయిల్ ఐడి, మరియు ఆధార్ కార్డు ద్వారా One Time Registration పూర్తి చేయండి.
2.రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్ నెంబర్ మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి డాష్ బోర్డు లోని స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ దగ్గర అప్లై బటన్ నొక్కండి.
3. మీ విద్యార్హతలు, మీరు పోటీపడాలనుకుంటున్న పోస్ట్, మీకు ఇష్టమైన ఎగ్జామ్స్ సెంటర్ ఎంచుకోండి.
4. లైవ్ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి.
5. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించండి.
6. అన్ని వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సక్సెస్ అయినట్లయితే మీకు మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top