
కొత్తగా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) లో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|New job notifications have been released in Delhi Subordinate Services Selection Board :
DSSSB ఢిల్లీ ప్రభుత్వం లోని వివిధ శాఖలలో గ్రూప్ బి మరియు గ్రూప్ సి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లీగల్ అసిస్టెంట్,అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్( సివిల్)& గ్రేడ్-||(GNCTDSS)/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.డిప్లమో/ డిగ్రీ /బి.టెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి24,2026 (మధ్యాహ్నం 12) మార్చి 25,2026 (రాత్రి 11:59) వరకు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

- సంస్థ పేరు(Institution name): ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్
- పోస్టుల సంఖ్య(Number of posts): 911
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 33
జూనియర్ ఇంజనీర్ (సివిల్): 281
గ్రేడ్-II (GNCTDSS) / అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 596
- రిక్రూట్మెంట్ విధానం(Recruitment process) :
వన్ టైర్ పరీక్ష (AE & JE కోసం)
రెండు టైర్ పరీక్ష (లీగల్ అసిస్టెంట్ & ASO కోసం)
నెగటివ్ మార్కులు: తప్పు సమాధానానికి 0.25 / 0.50 మార్కులు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- వయో పరిమితి(Age limit): 18 నుంచి30 సంవత్సరాలు
- విద్యార్హతలు ( Education Qualification):
డిప్లమో /డిగ్రీ /బీటెక్ - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):24/02/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):25/03/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్
- రిజర్వేషన్( Reservation):
SC/ST/OBC/EWS/PwBD/ESM అభ్యర్థులకు రిజర్వేషన్ లభిస్తుంది.
ఢిల్లీ అభ్యర్థులకు మాత్రమే(OBC) సర్టిఫికెట్ పై రిజర్వేషన్ లభిస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి EWS సర్టిఫికెట్ చెల్లుబాటులో ఉండాలి. - వెబ్ సైట్ పేరు ( website name):https://dsssbonline.nic.in