Union Bank of India Jobs : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసింది|Union Bank of India Has Released New Job Notifications

Spread the love
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసింది|Union Bank of India Has Released New Job Notifications :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసింది. మొత్తం 1865 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్ష ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. శిక్షణా సమయంలో మీకు నెలకు 15000 నుండి 20,000 జీతం వస్తుంది. బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నందు 303 పోస్టులు తెలంగాణ నందు 164 పోస్టులను భర్తీ చేయనున్నారు. 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ బట్టి వయసు సడలింపు ఉంటుంది. వయసు సడలింపు వివరాలు కింద ఇవ్వబడుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ https://ibponline.ibps.in/ubiaaprsep24/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. 29 ఏప్రిల్ 2026 ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. 19 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. తాత్కాలికంగా మే లేదా జూన్ 2026 ఆన్లైన్ పరీక్ష తేదీ.

Whatsapp Group

దరఖాస్తు చేయు విధానం :
1.https://ibponline.ibps.in/ubiaaprsep24/ ఈ లింక్ ఓపెన్ చేసి click here for new registration మీద క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
2. మీ ఫోటో మరియు సంతకాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
3. మీ చదువు చిరునామా మరియు ఇతర వివరాలను పూరించాలి.
4. చివరగా మీ కేటగిరీని బట్టి నిర్ణయించిన ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు చేసే సమయంలో మీ వద్ద ఆధార్ కార్డు విద్యార్హత సర్టిఫికెట్లు మరియు వ్యాలీడ్ ఇమెయిల్ ఐడి ఉండేలా చూసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top