New Job Notifications in RTC : 10th అర్హతతో RTC నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|New Jobs Notifications Requiring a 10th-grade Qualification Have Been Released by the RTC

Spread the love

10th అర్హతతో RTC నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|New Jobs Notifications Requiring a 10th-grade Qualification Have Been Released by the RTC :

TGSRTC(తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఈ ఉద్యోగ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 10th విద్యార్హత కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం నందు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన కారణంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఆర్టీసీ యాజమాన్యం మరియు ప్రభుత్వం తాత్కాలికంగా కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేవు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్(Offline ) అనగానే నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోగలరు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత :
డ్రైవర్:
1.హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా కలిగి ఉండాలి.
2.18 నెలల అనుభవం కలిగి ఉండాలి.
3.ఆర్టీసీ అధికారులు నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ నందు ఉత్తీర్ణత సాధించాలి.
కండక్టర్ :
1.10th class ఉత్తీర్ణులై ఉండాలి.
2.గతంలో కండక్టర్ గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి
Or
రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

New Jobs Notifications Requiring a 10th-grade Qualification Have Been Released by the RTC :

జీతం డ్రైవర్లకు రోజుకు ₹1000 వరకు చెల్లించే అవకాశం ఉంది. కండక్టర్లకు రోజుకు ₹500 నుండి ₹800 మధ్య చెల్లించడం అవకాశం ఉండవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు అనగా10th, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాటి జిరాక్స్లను,రెండు లేదా మూడు passport సైజు ఫోటోలు తీసుకువెళ్లాలి.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్లైన్ నందు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ నింపవలసిన అవసరం లేదు. నేరుగా వెళ్లి మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆర్టీసీ(RTC Depot) డిపో లేదా రీజినల్ మేనేజర్(Regional Manager)కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోగలరు.

Whatsapp Group

ఎంపిక విధానం : మీరు డిపో కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు మీయొక్క సర్టిఫికెట్లను పరిశీలించి అక్కడికక్కడే ఒక చిన్న డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మీరు డ్రైవింగ్ టెస్ట్ నందు ఉత్తీర్ణులు అయితే వెంటనే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే ఈ విషయాన్ని గమనించి ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకు వెళ్లి అధికారులను కలవండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top